31-01-2026 05:39:43 PM
కూచిపూడి తండా సర్పంచ్ హాజీ నాయక్
కోదాడ: కోదాడ మండల పరిధిలోని కూచిపూడి తండా గ్రామంలో శనివారం పశువైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది. వైద్య శిబిరంలో 40 పశువులకు గర్భం కోశ వ్యాధులు ఉన్నట్టు నిర్ధారించడం జరిగింది. వాటికి తగిన చికిత్స అందించడం జరిగింది వంద దూడలకు నటలమందు ఇవ్వటం జరిగింది.
కార్యక్రమంలో సర్పంచ్ బాదావత్ హాజీ నాయక్, ఉపసర్పంచ్ సీత మహాలక్ష్మి కుమారస్వామి, వార్డ్ మెంబర్స్, పెద్దలు, ఇట్టి కార్యక్రమంలో పశు వైద్యులు కోదాడ మండలం పశు వైద్యాధికారి డాక్టర్ మధు కాపుగల్లు, పశువైద్యాధికారి డాక్టర్ సురేందర్, గోపాలమిత్ర శెట్టి నాంచారయ్య, ప్రసాదు, వెంకటేశ్వర్లు ఆదినారాయణ మోష గ్రామపంచాయతీ సిబ్బంది సైదా నాయక్ గ్రామస్తులు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.