calender_icon.png 14 August, 2025 | 2:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుండాల మండలంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు విస్తృత పర్యటన

05-12-2024 04:59:42 PM

మణుగూరు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పరిధిలోని గుండాల మండలంలో గురువారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మండలంలోని ముత్తాపురం ఏకలవ్య స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో చాలా జాగ్రత్త పాటించాలని నిర్మాణ ఇంచార్జిని ఆదేశించారు. గుండాల మండలంలోని పలు పంచాయతీలలో రూ.1.50 కోట్ల నిధులతో బీటి నిర్మాణానికి శంకుస్థాపన, అలాగే పలు సిసి రోడ్లను ప్రారంభించారు.