11-10-2025 03:19:30 PM
- బాకీకార్డులతో వినూత్ననిరసన
- మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
బెల్లంపల్లి అర్బన్: హామీలు ఇచ్చి గెలిచిన సీఎం రేవంత్ రెడ్డి మాటతప్పినoదూకు రాజీనామా చేసి గద్దెదిగాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. శనివారం ప్రజలకు బాకీ పడిన హామీ కార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీ బాకీలను తీర్చాలని డిమాండ్ చేశారు. లేనియెడల కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బత్తుల సుదర్శన్, బీఆర్ఎస్ నాయకులు ఎరుకల సుందర్ రావు,నూనేటి సత్యనారాయణ, గోగర్ల సత్యనారాయణ, కాంపల్లి రాజo, మద్దెలగోపి తదితరులు పాల్గొన్నారు.