calender_icon.png 11 October, 2025 | 8:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష ఎన్నిక

11-10-2025 03:25:25 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేసే దిశగా అధిష్టానం అడుగులు వేస్తుంది. అందులో భాగంగా రాష్ట్రంలోని జిల్లా అధ్యక్ష పదవులను కేటాయించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికను పరిశీలించేందుకు 'డాక్టర్ నరేష్ కుమార్ ను అధిష్టానం కేటాయించింది. ఢిల్లీ నుండి వచ్చిన నరేష్ కుమార్ జిల్లా అధ్యక్ష ఎన్నిక కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆయనతో పాటు పిసిసి కోఆర్డినేటర్ శివలింగ్ శ్రీనివాస్ హాజరుకానున్నారు.

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఎన్నిక నేపథ్యంలో జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నట్లు తెలిసింది. జిల్లా అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది. అధ్యక్ష పదవి రేసులో ప్రస్తుత అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు తోపాటు మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నియోజకవర్గ ఇన్చార్జ్ అజ్మీర శ్యాం నాయక్, ఎమ్మెల్సీ దండే విట్టల్ తోపాటు పలువురు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

కుల సమీకరణాల నేపథ్యంలో జిల్లా అధ్యక్ష పదవి అధిష్టానం ఎవరికి కేటాయిస్తుందన్న ఆలోచనలో పార్టీ శ్రేణులు ఉన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ రావు 10 సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ ఆయన పార్టీని అంటి పెట్టుకొని కార్యకర్తలకు భరోసాగా నిలిచాడని ఆయనకే మరోసారి అధ్యక్ష పదవి కేటాయించాలని ఆయన వర్గీయులు కోరుతున్నారు.