calender_icon.png 12 October, 2025 | 12:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పలు వివాహ శుభకార్యాలకు హాజరైన ఎమ్మెల్యే

11-10-2025 08:05:09 PM

చిట్యాల (విజయక్రాంతి): పలు వివాహ శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆశీర్వదించారు. చిట్యాల పట్టణానికి చెందిన పెద్ది నరేందర్ కుమారుడి వివాహానికి, తాళ్లవెల్లంల గ్రామానికి చెందిన చికిలంమెట్ల వెంకటయ్య కుమారుడి వివాహానికి, నేరడ గ్రామానికి చెందిన వడేగాని మహేష్ కుమారై వివాహ నిశ్చితార్థ కార్యక్రమనికి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక అమరేందర్ రెడ్డి, కాటం వెంకటేశం, జనగాం రవీందర్, ఎద్దులపూరి కృష్ణ, జడల చిన్న మల్లయ్య, మారగోని ఆంజనేయులు తదితరులు హాజరయ్యారు.