calender_icon.png 11 October, 2025 | 8:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ చైర్మన్, కమిషనర్‌లపై బీఆర్ఎస్ నాయకులు ఫైర్

11-10-2025 03:13:41 PM

అమీన్ పూర్: పదవీ కాలం ముగిసినా చైర్మన్ పదవిపై మోజుతో అమాయక ప్రజలను మాజీ హోదాలో మున్సిపల్ అధికారులను తన గుప్పిట్లో పెట్టుకుని ఆపద్ధర్మ మున్సిపల్ చైర్మన్ గా పాండురంగారెడ్డి వ్యవహరిస్తుండడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కు వంత పాడుతూ తన అధికారాలను కాలరాస్తూ అమీన్ పూర్ ప్రజలకు కాలకూటమిగా మారిందని మండిపడ్డారు.

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని సాయి అంబిక కాలనీ హెచ్ఎండీఏ వెంచర్ లో నిర్మించుకుంటున్న ఇంటి మెట్లను మున్సిపల్ అవుట్ సోర్సింగ్ సిబ్బందితో మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి కమిషనర్ సాయంతో నిర్దాక్షిణ్యంగా కూల్చివేయించడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమీన్ పూర్ మున్సిపాలిటీ కమిషనర్ జ్యోతి రెడ్డి, మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి చేస్తున్న అరాచాకలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఏ హోదాలో పాండురంగారెడ్డి కమిషనర్ కార్యాలయంలో కూర్చుని బిల్డర్లతో, ఇళ్లు నిర్మించుకుంటున్న వారితో సెటిల్ మెంట్లు చేస్తున్నారని‌ ప్రశ్నించారు.

ప్రభుత్వ వేతనాలు తీసుకుంటున్న కమిషనర్ జ్యోతి రెడ్డి ప్రైవేటు వ్యక్తికి పనిచేయడం ఏంటన్నారు. అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో ఎన్నో అక్రమ భవనాలు, కమర్షియల్ భవనాలు వెలుస్తున్నా మామూళ్ల మత్తులో తూగుతూ అమాయక ప్రజలపై పెత్తనం చలాయిస్తుందన్నారు. కమిషనర్ పై, అవుట్ సోర్సింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, ఈ విషయంపై కలెక్టర్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. లేని పక్షంలో మాజీ చైర్మన్‌ బాధితులు చాలా మంది ఉన్నారని, వారితో అమీన్ పూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగుతామని  గడిల శ్రీకాంత్ , బాల్ రెడ్డి, మాణిక్ యాదవ్, రాజేష్ గౌడ్, బాధితులు ముఖేష్ హెచ్చరించారు.