11-10-2025 07:55:10 PM
గుండాల (విజయక్రాంతి): అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం శనివారం గుండాల మండలంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల పిల్లలతో సమావేశం ఏర్పాటు చేసారు. బాలల హక్కులు, బాల్య వివాహలు, రిజిస్ట్రేషన్ యాక్టు, పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పిఎల్ఓలు కునగళ్ల మల్లేశం, ఎండి మౌలానా మాట్లాడారు. బాల్య వివాహలు చేసుకోవద్దని అమ్మాయిలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ విజయలక్ష్మి ఉపాధ్యాయునిలు, విద్యార్థులు పాల్గొన్నారు.