calender_icon.png 23 January, 2026 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుమలగిరిలో బీఆర్‌ఎస్ సమావేశం

23-01-2026 12:00:00 AM

తుంగతుర్తి, జనవరి 22: తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా. గాదరి కిశోర్ కుమార్  ఆదేశానుసారం రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తిరుమలగిరి పట్టణం 10 వ వార్డులో సంకేపల్లీ రఘునందన్ రెడ్డి ఆధ్వర్యంలో, 6 వార్డులో తాటికొండ సీతయ్యల ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకుల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ నాయకులు కష్టపడే పని చేసి, గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాజిరెడ్డిగూడెం మండల అధ్యక్షుడు సోమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.