23-01-2026 12:00:00 AM
అభివృద్ధిని చేతల్లో చేసి చూపిస్తున్నాం..
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),జనవరి 22: నియోజకవర్గంలో అభివృద్ధిని మాటల్లో కాకుండా చేతల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం చూపిస్తుందని,చేతల ప్రభుత్వంతో చెలగాటం వద్దని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ప్రతిపక్ష పార్టీలకు చురకలాంటించారు.గురువారం మండ ల పరిధిలోని వేల్పుచర్ల గ్రామంలో ఎస్డీఎఫ్ నిధులు రూ.కోటి యాభై లక్షలతో సూర్యాపేట - జనగాం365(బీ)జాతీయ రహదారి నుండి వేల్పుచర్ల గ్రామంలోకి బీటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.
అదేవిధంగా రూ.20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో 75 ఏళ్లు గడిచిన వేల్పుచర్ల గ్రామానికి రోడ్డు వేయలేదని,తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నియోజకవర్గానికి రూ.5 కోట్లతో రోడ్లు మంజూరు చేయించానని అన్నారు. ఉపాధి హామీ పేరులో గాంధీ పేరును మా ర్చి కూలీలు గడ్డపారలు పక్కన పడేసే పని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేస్తుందని ఎద్దేవా చేశారు. ఉద్యమ పార్టీ అని చెప్పుకొచ్చే పార్టీ కుటుంబ కలహాలతో కొట్లాడు కుంటున్నారని అన్నారు.రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెరుకు వెంకటమ్మ, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు,ఉపసర్పంచ్ వజ్జె రవి,పీఆర్ డీఈ బాబురావు, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీఓ ఝాన్సీ, ఎస్‌ఐ సైదులు,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోరపాక సత్యం, కాంగ్రెస్ జిల్లా నాయకులు గుడిపెల్లి మధుకర్ రెడ్డి, అనిరెడ్డి రాజేందర్ రెడ్డి,జీడి వీరస్వామి,కుంట్ల సురేందర్ రెడ్డి, వేల్పుల రమేష్,శిగ నసీర్ గౌడ్, ఏఎంసీ డైరెక్టర్లు జలంధర్,సైదులు వివిధ గ్రామాల సర్పంచ్లు విద్యాసాగర్,పాశం కరుణభాస్కర్ రెడ్డి,లూనవత్ కృష్ణ,మండల నాయకులు చిక్కుల శేఖర్,రవీందర్, మహేష్, వివిధ శాఖల అధికారులు,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.