calender_icon.png 4 July, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పాలనతో రాష్ట్ర ప్రజలు హరి గోసలు పడుతున్నారు

03-07-2025 09:17:51 PM

మాజీమంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి..

చండూరు (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటుకు మొదలయ్యారని, అభివృద్ధి లేక, పథకాలు సరిగా అందక హరి గోసాలు పడుతున్నారని మాజీ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి(Former Minister Jagadish Reddy) అన్నారు. గురువారం మాజీ ఎంపీపీ తోకల వెంకన్న భవనాన్ని కూల్చివేతపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనంటే రాష్ట్ర ప్రజలకు ఏడాది నారా కాలంలోనే అర్థమయిపోయిందని, కాంగ్రెస్ పాలనలో ప్రజలు బతకలేమని రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థం అయిందన్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ఒక్క రూపాయి అభివృద్ధి జరగలేదు. కానీ, వందలాది కేసులు పెడుతున్నారు.

రాష్ట్రంలో పోలీస్ శాఖ మాత్రమే పని చేస్తుందని అన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొత్తగా తెచ్చి వేసిన రోడ్డు లేదు, వ్యవసాయరంగం పూర్తిగా నిర్లక్ష్యం అయిందన్నారు. తెలంగాణ వచ్చే నాటికి నల్లగొండ అఖరులో ఉంటే.. కేసీఆర్ పాలనలో అగ్రస్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చేశా, కానీ మళ్లీ కాంగ్రెస్ పాలనలో నకిలీ విత్తనాలు విచ్చలవిడిగా వస్తున్నాయని ఆరోపించారు. నిన్నటి రివ్యూ మీటింగ్ లో వాళ్ల ఎమ్మెల్యేలే అంటున్నారు. ఇదేం సమీక్షా అని, మంత్రులు మాత్రమే మాట్లాడితే మేం ఎందుకు అని ఎమ్మెల్యేలు అనుకుంటున్నారన్నారు. కొంత మంది ప్రజా ప్రతినిధులు పోలీసల నుంచి మామూళ్లు తీసుకోవడం దురదృష్టకరమన్నారు. ఉత్తమ్‌ నీటి పారుదల, సివిల్ సప్లై శాఖలపై అవగాహన లేదు. 

కృష్ణా నదితో పాటు గోదావరి జాలలను సైతం ఆంధ్రకు అప్పజెపుతున్నారు. సీఎం, మంత్రులు కేసిఆర్‌ను తిట్టడంలోనే పోటీ పడుతున్నారని విమర్శించారు. నల్లగొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌ నేతలపై, కార్యకర్తలపై అక్రమకేసులు పెడుతున్నారు. ఇలాంటి కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. సమస్యలపై ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో కాంగ్రెస్ దుర్మార్గలకు చెక్ పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చండూరులో జరుగుతున్న పనులన్నీ బీఆర్‌ఎస్ సర్కార్‌ ఇచ్చినవే. మునుగోడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చందుకు మేము ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ పనులు మంజూరు ఇచ్చాము.

మునుగోడులో ఇప్పుడు అక్కడక్కడా జరుగుతున్న పనులన్నీ కేసిఆర్‌ హయాంలోనివేనని స్పష్టం చేశారు. కమీషన్స్ కోసం బిల్లులు ఆపడం కాంగ్రెస్ నేతలకే చెల్లిందన్నారు.కేంద్రంగా ఉన్న అభివృద్ధి అంశాలపై దృష్టి పెట్టకుండా, మంత్రులు, ముఖ్యమంత్రి వరకు కేవలం కే.సి.ఆర్ను తిట్టటమే ప్రధానంగా పెట్టుకున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, పార్టీ నేతలు పాల్వాయి స్రవంతి, రెగట్టే మల్లికార్జున రెడ్డి, మాజీ చైర్ పర్సన్ తోకల చంద్రకళ వెంకన్న, మాజీ జెడ్పిటిసి కర్నాటి వెంకటేశం,కోడి వెంకన్న, కొత్త పార్టీ సతీష్  తదితరులు పాల్గొన్నారు.