03-07-2025 08:32:16 PM
మేడ్చల్ అర్బన్: మేడ్చల్ మండల(Medchal Mandal) నూతన తహసీల్దారుగా వి. భూపాల్ గురువారం తన కార్యాలయ ఆవరణలోని గడి మైసమ్మ తల్లిని దర్శించుకుని బాధ్యతలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా న్యాలకల్ మండల తహసీల్దారుగా విధులు నిర్వహిస్తున్న ఆయనను మేడ్చల్ మండల తహసీల్దారుగా మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే మేడ్చల్ తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన వి.భూపాల్ గతంలో బాచుపల్లి, కుత్బుల్లాపూర్, దుండిగల్ తహసీల్దార్ గా పని చేశారు.