calender_icon.png 4 July, 2025 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు నమోదు చేయాలి

03-07-2025 09:14:32 PM

బిఎల్ఓలు తమ విధులను సక్రమంగా నిర్వహించాలి: మంథని ఆర్డీఓ సురేష్..

కమాన్ పూర్ (విజయక్రాంతి): 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు నమోదు చేయాలని మంథని ఆర్డీఓ సురేష్(RDO Suresh) అన్నారు. గురువారం కమాన్ పూర్ మండలంలోని నాగారం గ్రామంలో రైతు వేదికలో తహసీల్దార్ ముస్త్యాల వాసంతి(Tehsildar Mustyala Vasanthi) ఆధ్వర్యంలో బిఎల్ వోలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ... బిఎల్ఓలు తమకు అప్పగించిన పనులను సక్రమంగా నిర్వర్తించాలని, ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా బిఎల్వోలకు ఈ నెల మూడో తేదీ నుండి 17వ తేదీ వరకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ముఖ్యంగా గ్రామాల్లో ఎవరైనా ఊరు విడిచి వెళ్ళిపోతే వారి పేరును తొలగించాలని సూచించారు.

ఎవరైనా మరణించిన వారు ఉంటే వారి పేర్లను సైతం తొలగించాలని స్పష్టం చేశారు. ప్రతి బూత్ లెవెల్ అధికారి ఇంటింటికి తిరుగుతూ సర్వే నిర్వహించి, వారి వివరాలను సేకరించాలని ఎవరైనా పేరు నమోదు గాని వ్యక్తులు ఉంటే వారి పేర్లను ఓటర్ లిస్టులో నమోదు చేయాలని పేర్కొన్నారు. మాస్టర్ ట్రైనర్ మెరుగు రాజమౌళి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇనస్పెక్టర్ స్రవంతి, సీనియర్ అసిస్టెంట్ సతీష్, తదితరులు పాల్గొన్నారు.