03-07-2025 09:19:31 PM
కాగజ్‌నగర్ (విజయక్రాంతి): సబ్సిడీ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ(Mandal Agriculture Department Officer Ramakrishna) సూచించారు. గురువారం మండలంలోని చారిగాం గ్రామంలో జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా కంది, జొన్న విత్తనాలను 100% రాయితీపై రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం అందజేస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు పంటలపై నానో ఎరువులను వినియోగించుకోవాలని తెలిపారు. ఎరువులు అవసరం ఉన్న రైతులు పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డు తీసుకొనిరావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు.