calender_icon.png 4 July, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్ లక్ష్యాన్ని వారంలోపు పూర్తి చేయాలి

03-07-2025 09:07:12 PM

రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్...

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): రబీ 2023-24 కు సంబంధించి మిగిలిపోయిన కస్టమ్ మిల్లింగ్ రైస్(Custom Milling Rice) లక్ష్యాన్ని వారంలోపు పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్(Revenue Additional Collector J. Srinivas) జిల్లా రైస్ మిల్లర్లతో కోరారు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలోని రైస్ మిల్లర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో సీఎంఆర్ పై సమావేశం నిర్వహించారు. 2023-24 రబీ సీఎంఆర్ కు సంబంధించి ఇంకా 73 ఏసికే లు చెల్లించాల్సి ఉందని, అందువల్ల రైస్ మిల్లర్లు వారం రోజుల్లో చెల్లించడంతో పాటు, 2024-25 రబీకి సంబంధించిన సీఎంఆర్ ను సైతం వేగవంతం చేయాలని ఆయన కోరారు.

సీఎంఆర్ చెల్లింపులో నిర్లక్ష్యం చేయవద్దని, జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు చెల్లిస్తే ఇబ్బంది ఉండదని తెలిపారు. నిర్దేశించిన లక్ష్యాల మేరకు మిల్లర్లు సీఎంఆర్ చెల్లించాలని కోరారు. పౌరసరఫరాల విభాగం డిప్యూటీ తహసీల్దారులు ప్రతిరోజు పర్యవేక్షించాలని చెప్పారు. జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశం, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నారాయణ, శ్రీనివాస్, రైస్ మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు, ఇతర అధికారులు, తదితరులు, ఈ సమావేశానికి హాజరయ్యారు.