03-07-2025 08:42:10 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఇన్‌స్పైర్ నామినేషన్ల శిక్షణ కార్యక్రమాన్ని గురువారం జిల్లా కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షల సహాయ కమిషనర్ ఉదయబాబు(Assistant Commissioner of Examinations Udayababu) మాట్లాడుతూ... సెప్టెంబర్ 30వ తేదీలోపు విద్యార్థుల ఇన్స్పైర్ నామినేషన్లు పూర్తి చేయాలని సూచించారు. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అధికారి దేవాజీ మాట్లాడుతూ... నామినేషన్ల సంఖ్యతో పాటు నాణ్యతపై దృష్టి సారించి, మెరుగైన ఆలోచనలకు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
జిల్లా సైన్స్ అధికారి కటకం మధూకర్ మాట్లాడుతూ... ప్రతి పాఠశాలలో ముందుగా ఐడియా కాంపిటీషన్ నిర్వహించి, నాణ్యమైన ఐదు ఆలోచనలను ఎంపిక చేయాలని సూచించారు. ఎంపికైన ఐదుగురు విద్యార్థుల బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేసి, వారి వివరాలను ఇన్‌స్పైర్ మాన్‌కీ ఆప్‌లో అప్‌లోడ్ చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు రేపు, జూలై 4న ఉమ్మడిగా ఐడియా కాంపిటీషన్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఏడాది పదవ తరగతి , ఇంటర్మీడియట్ (12వ తరగతి) విద్యార్థులనూ ఇన్‌స్పైర్ నామినేషన్లకు ఎంపిక చేయవచ్చని తెలిపారు. అనంతరం రిసార్ట్స్ పర్సన్స్ మామిడాల తిరుపతయ్య, దుర్గాదాస్ లు ఇన్‌స్పైర్ నామినేషన్స్ గురించి వివరించారు. ఈ శిక్షణ శిబిరానికి ఆసిఫాబాద్ డివిజన్ లోని అన్ని పాఠశాలల జీవశాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.