03-07-2025 08:34:54 PM
సన్నాహాక సమావేశం ఏర్పాటు చేసిన సుడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి..
కరీంనగర్ (విజయక్రాంతి): అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjun Kharge) పాల్గొనే బహిరంగ సభకు కార్యకర్తలు భారీగా తరలి వెళ్ళాలని సుడా చైర్మన్ పిలుపునిచ్చారు. నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి సెల్స్ అధ్యక్షులు డివిజన్ల అధ్యక్షులు సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ నాయకులమంతా కలిసి కట్టుగా ఈ బహిరంగ సభకు తరలి వెళ్ళాలని బహిరంగ సభలో నాయకులు ఇచ్చిన సందేశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. అందరం ఎవరికి వారు ఏర్పాట్లు చేసుకున్నా అందరం కలిసి జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుండే తరలి వెళ్దామని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎండి తాజ్, కొరివి అరుణ్ కుమార్, శ్రవణ్ నాయక్, సమద్ నవాబ్, సాయిని తిరుపతి, కాంరెడ్డి రాంరెడ్డి, పంజాల స్వామి గౌడ్, మూల జైపాల్, కల్వల రాంచందర్, ఎండి చాంద్, నేహాల్, రమణారెడ్డి, మేకల నర్సయ్య, దండి రవీందర్, వరాల నర్సింగం తదితరులు పాల్గొన్నారు.