03-07-2025 08:37:45 PM
ముత్తారం (విజయక్రాంతి): మండలంలోని పోతారం గ్రామంలో చెరువు కట్టపై ఉన్న మట్టి రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు బురదమయం కావడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రజల ఇబ్బందులను గమనించిన గ్రామ కాంగ్రెస్ నాయకులు రహదారిని చదును చేశారు. గురువారం కాంగ్రెస్ నాయకులు చెరువు కట్టపై ట్రాక్టర్ తో మట్టిని చదును చేయించి గ్రామస్థుల రాకపోకలకు అనువుగా ఉండేలా చేశారు. బురద మయమైన రహదారిని చదును చేయడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేసి, కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నర్ర మల్లయ్య, గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నెతెట్ల కిరణ్, మాజీ ఎంపీటీసీ భారత లక్ష్మీ కొమురయ్య, కాంగ్రెస్ నాయకులు బత్తుల మల్లయ్య, ఇట్టం గట్టయ్య, వల్లెపు మొగిలి, నర్ర ఓదేలు తదితర స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.