calender_icon.png 3 May, 2025 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిఆర్ఎస్ రజతోత్సవాన్ని విజయవంతం చేయాలి

14-04-2025 08:45:36 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని, ప్రతి గ్రామం నుండి బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో తరలిరావాలని మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత పిలుపునిచ్చారు. సోమవారం జిల్లాలోని నర్సింహులపేట, దంతాలపల్లి మండలాల్లో బీఆర్ఎస్ రజోత్సవ సన్నాహక సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రజతోత్సవ సభ ద్వారా బీఆర్ఎస్ సత్తాను చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ తో కలిసి రజోత్సవ ప్రచార పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.