calender_icon.png 6 May, 2025 | 7:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోటి 22 లక్షల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

03-05-2025 11:00:00 PM

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి..

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి(MLA Pocharam Srinivas Reddy) కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ టౌన్, బాన్సువాడ రూరల్ నసరుల్లాబాద్, బీర్కుర్, మండలాలకు చెందిన  కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ 122 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బాన్సువాడ టౌన్ 44 మంది లబ్ధిదారులకు రూ.44,05,104/-, బాన్సువాడ రూరల్ 37 మంది లబ్ధిదారులకు రూ.37,04,292/-, నసరుల్లబాద్ మండలం 19 మంది లబ్ధిదారులకు రూ.19,02,204/-, బీర్కుర్ మండలంలో 22 మంది లబ్ధిదారులకు రూ.22,02,552/-, మొత్తం 122 లబ్ధిదారులకు రూ 1,22,14,152/- లనులబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీర్కూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం శ్యామల, నస్రుల్లాబాద్ తాసిల్దార్, పట్టణ మండల నాయకులు పాల్గొన్నారు.