calender_icon.png 6 May, 2025 | 7:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్ సందర్శన వేళలో మార్పు

03-05-2025 10:39:43 PM

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష..

పెద్దపల్లి (విజయక్రాంతి): సమీకృత జిల్లా కలెక్టరేట్లో వివిధ సమస్యలపై ప్రజలు కలెక్టర్ ను నేరుగా కలిసే సందర్శన వేళల్లో స్వల్ప మార్పు చేయడం జరిగిందని, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(District Collector Koya Sriharsha) శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు కార్యాలయ పని దినాలలో సమీకృత జిల్లా కలెక్టరేట్ లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాను అందుబాటులో ఉంటానని, వివిధ సమస్యలు, పనులు ఉన్న సందర్శకులు, ఫిర్యాదుదారులు, ప్రజలు ఆ సమయంలో నేరుగా తనను కలవోచ్చని కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కు వివిధ సమస్యలపై దరఖాస్తులు సమర్పించాలనుకునే వారు విజిటింగ్ సమయంలో సమీకృత జిల్లా కలెక్టరేట్ కు రావాలని, మిగిలిన సమయాల్లో వచ్చి, వేచి ఉండి తమ సమయాన్ని వృధా చేసుకోవద్దని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.