calender_icon.png 6 May, 2025 | 8:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రావెల్ మాఫియాకి అధికారుల అండ

03-05-2025 11:12:27 PM

అనుమతులు లేవు పనైపోతుంది...

రెవెన్యూ అధికారుల అలసత్వం అక్రమార్కుల ఆధిపత్యం..

చర్ల (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో అక్రమ గ్రావెల్ తోలకాలు జోరుగా జరుగుతున్నాయి. మండలంలోని కలివేరు గ్రామంలో వాటర్ ట్యాంక్ సమీపంలో ప్రభుత్వ భూమిలో గుట్టపైన ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా గ్రావెల్ తోలకాలు ఉన్నాయని వాహనాలు ప్రయాణించేందుకు రహదారి ఏర్పరచుకునే క్రమంలో మిషన్ భగీరథ పైప్ లైన్లు పగిలిపోయి నీరు వృధాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

రెండు రోజులుగా గుట్టను తోడేస్తూ జోరుగా టిప్పర్లతో గ్రావెల్ తొలకాలు జరుగుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారు. గ్రావెల్ తొలకలతో పభుత్వం ఖజానాకి గండి పడటంతో పాటు ప్రకృతి పర్యావరణానికి హాని జరుగుతోంది. ఇంత జరుగుతున్న అధికారులు నిమ్మకం నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ విషయమై మండల తాసిల్దార్ శ్రీనివాస్ ని వివరణ కోరగా అసలు గ్రావెల్ తొలకలు జారడం లేదంటూ కేవలం అక్కడ జేసిబి మాత్రానే ఉందని తోసిపుచ్చారు. రెవిన్యూ అధికారుల అలసత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అధికారుల తీరుతో అక్రమ గ్రావెల్ రవాణాకు అధికారుల హస్తం ఉందనే ఆరోపణలు వెలబడుతున్నాయి. అక్రమ గ్రామాల తోలకాలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.