03-05-2025 10:43:24 PM
జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు...
గద్వాల (విజయక్రాంతి): వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు(District Additional Collector Narasimha Rao) అధికారులకు ఆదేశించారు. శనివారం ఐజ మండలంలోని ఉప్పల గ్రామంలోని ఐకెపి సెంటర్ లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు ప్రక్రియ, ధాన్యం నాణ్యత, గోడౌన్ సదుపాయాలు, రైతులకు జారీ చేసే రసీదులు తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు జరగాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. తదనంతరం మల్దకల్, ఐజ లోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంను అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఐజ పురపాలక సంఘమును కూడా ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను తనిఖీ చేశారు సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, కేంద్రం నిర్వాహకులు,సంబంధిత అధికారులు, పాల్గొన్నారు.