calender_icon.png 6 May, 2025 | 7:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుంతలు పూడ్చి ప్రజల ఇబ్బందులు తొలగించండి

03-05-2025 10:49:13 PM

సిపిఐ ఆధ్వర్యంలో రాస్తారోకో..

ఖమ్మం (విజయక్రాంతి): ఖమ్మం నగరంలోని ప్రధాన రహదారి గుంతలమయంగా మారిందని వెంటనే వాటిని పూడ్చి ప్రజల ఇబ్బందులను తొలగించాలని సిపిఐ నగర కార్యదర్శి ఎస్కె జానిమియా డిమాండ్ చేశారు. రహదారికి మరమ్మతులు నిర్వహించాలని శనివారం సిపిఐ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని మమత రోడ్డు కొత్తగూడెం క్రాస్ రోడ్డు వద్ద సిపిఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిత్యం వందలాది వాహనాలు తిరిగే ఈ ప్రధాన రహదారి గుంతలమయంగా మారిందన్నారు. చినుకుపడిందంటే ఆ ప్రాంత మంత చిత్తడిగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రతి రోజు అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ దారి వెంబడి ప్రయాణిస్తున్న ప్రజలు, వాహనదారుల ఇబ్బందులు మాత్రం గుర్తించడం లేదని ఆయన ఆరోపించారు. మూడు రహదారుల కూడలి సెంటరైనా ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులను తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ రహదారిలో వెళ్లాలంటేనే ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వెంటనే గుంతలు పూడ్చి ప్రజల ఇబ్బందులను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శి పగడాల మల్లేష్, నాయకులు వరద నర్సింహారావు, మాలకొండయ్య, మాడుగుల నాగేశ్వరరావు, సిద్ది శ్రీనివాసరావు, కారం సామెలు, శీలం నాగేశ్వరరావు, రామకృష్ణ, శ్రీరాం, దుర్గ తదితరులు పాల్గొన్నారు.