24-01-2026 03:23:12 PM
మునిపల్లి,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలానికి చెందిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, పీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పైతర సాయికుమార్ శనివారం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా అందోల్- జోగిపేట మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగర వేసేలా అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో ప్రతి కార్యకర్త పని చేయాలని సూచించారు. కేటీఆర్ ను కలిసిన వారిలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.