24-01-2026 03:17:55 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్, 50 పడకల ఆసుపత్రి నిర్మాణం, బంజారా భవన్, ఇంటిగ్రేటెడ్ పాలిటెక్నిక్, రూ.62 కోట్ల నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.