calender_icon.png 24 January, 2026 | 4:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టులు గన్ దించి, రాజ్యాంగాన్ని ఎత్తుకోవాలి

24-01-2026 03:28:32 PM

రామగుండం,(విజయక్రాంతి): మావోయిస్టులు గన్ దించి, రాజ్యాంగాన్ని ఎత్తుకోవాలని, మావోయిస్టులు ఆయుధాలను, అరణ్యాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని అందుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కోరారు. శనివారం పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో సిపి ఎదుట 8 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తిస్ ఘడ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టు మిలీషియా కొరియర్ సాంస్కృతిక విభాగం, లోకల్ కమిటీ లో పనిచేసే వారుగా సీపీ తెలిపారు‌.

మావోయిస్టు ముఖ్య నేత శ్రీకాంత్ తో పాటు మరో ఏడుగురు మావోయిస్టులు లొంగిపోగా, అందులో ఒకరు మహిళ మావోయిస్టు ఉన్నారని తెలిపారు. మావోయిస్టులు గన్ను దించి, రాజ్యాంగాన్ని ఎత్తుకోవాలని సూచించారు. లొంగిపోవాలనుకునే మావోయిస్టులకు రక్షణ కల్పిస్తామన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం తరఫున అందించే పునరావాసం తో పాటు పథకాలను వర్తింపచేస్తామన్నారు. రాజ్యాంగం ద్వారానే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని, హింసను సృష్టిస్తే నేరస్తులవుతారన్నారని, పోరు వద్దు ఊరు ముద్దు అని ఆయుధాలను, అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలవాలని సిపి పిలుపునిచ్చారు.