01-11-2025 03:09:22 PM
బీఆర్ఎస్ మండల కార్యదర్శి జీడి సుందర్
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునిత అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని జాజిరెడ్డిగూడెం మండల బీఆర్ఎస్ కార్యదర్శి జీడి సుందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని, కేసీఆర్ జన రంజన పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు.