calender_icon.png 1 November, 2025 | 6:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెల చివరి వరకు పోలీస్ యాక్ట్ అమలు

01-11-2025 03:06:31 PM

జిల్లా ఎస్పీ  డి. జానకి

మహబూబ్‌నగర్,(విజయక్రాంతి): శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని నేటి నుంచి ఈ నెల 30వ తేది వరకు మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ - 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహించరాదని సూచించారు.

శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా లేదా ప్రజాధనానికి నష్టం కలిగించే ఎలాంటి చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేపట్టకూడదన్నారు. జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, సంఘాల నాయకులు పోలీసు విభాగానికి సహకరించవలసిందిగా ఎస్పీ తెలియజేశారు. అనుమతి లేకుండాపై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని ఎస్పీ హెచ్చరించారు.