calender_icon.png 1 November, 2025 | 6:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్ మహా నగరాన్ని వరద ముంపు నుండి కాపాడండి

01-11-2025 03:13:53 PM

ముఖ్యమంత్రికి లేఖ రాసిన శేషు

హనుమకొండ,(విజయక్రాంతి): ప్రతిసారి  వరద ముంపుకి గురవుతున్న వరంగల్ మహా నగరాన్ని వరద ముంపు నుండి కాపాడాలని ప్రజావేదిక రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. వరద ముప్పులను వాటి వల్ల జరిగే  అనర్ధాలను తెలియజేసే విధంగా ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అనంతరం డాక్టర్ శేషు మాట్లాడుతూ 2021 తరువాత ఇప్పటికీ  నాలుగు పర్యాయాలు వరంగల్ మహానగరం వరద ముప్పుకు గురై ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా, పేద ప్రజలు ఇళ్లు కోల్పోవడం, ఆస్తి నష్టం కూడా జరుగుతుంది.

కాబట్టి వరదలు వచ్చిన తరువాత చర్యలు చేపట్టే బదులు వరద ముంపుకు గురి కాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. 2021 వరదల సందర్భంగా వరంగల్ నగరాన్ని సందర్శించిన నాటి పురపాలక శాఖ మంత్రి ఆక్రమణల తొలగింపుకి కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసి ఆక్రమణలను తొలగించి మూడు నెలలలో పరిష్కారం చూపెడతామని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ నెరవేరలేదు ఆక్రమణలు తొలగించలేదు.ఆరు నెలల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వరంగల్ లో అండర్ డ్రైనేజ్ నిర్మాణం కోసం 4170 కోట్ల రూపాయలను కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

కానీ ఇంకా నిర్మాణం కోసం ఎలాంటి  పనులు ప్రారంభం కాలేదన్నారు. నగరపాలక అధికారుల అశ్రద్ధ, నిర్లక్ష్యం పట్టింపులేని ధోరణి వలన విపత్తు,నిర్వహణ వైఫల్యంతో వరంగల్ నగరం తరచూ వరద ముప్పుకు గురవుతుంది. కాబట్టి ఇప్పటికైనా వరద ముంపుకి గురి కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.తుఫాన్ వలన దెబ్బతిన్న రహదారులను పునర్ నిర్మించాలని, అలాగే మెంథా తుఫాన్ వలన ఇళ్లు కోల్పోయిన వారికి, ఆస్తి నష్టం జరిగిన వారికి 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.