calender_icon.png 12 January, 2026 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్రికల పాత్ర మరింత బలోపేతం కావాలి

10-01-2026 12:00:00 AM

వేములవాడ, జనవరి 9,(విజయక్రాంతి):రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ పట్టణంలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తన క్యాంపు కార్యాలయంలో విజయక్రాంతి జాతీయ దినపత్రిక నూతన సంవత్సరం2026 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో జరుగుతున్న వాస్తవాలను నిర్భయంగా, నిష్పక్షపాతంగా ప్రజలకు చేరవేయడంలో పత్రికల పాత్ర అత్యంత కీలకమని అన్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో మీడియా ఒక ప్రధాన స్థంభంగా నిలుస్తోందని పేర్కొన్నారు. విజయక్రాంతి దినపత్రిక ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చే విధంగా, బాధ్యతాయుతమైన జర్నలిజంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అలాగే నూతన సంవత్సరంలో పత్రిక మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని, పాఠకుల విశ్వాసాన్ని మరింతగా పొందాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్రిక ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.