08-01-2026 12:00:00 AM
మాజీ మంత్రి డీఎస్ రెడ్యా నాయక్
మరిపెడ, జనవరి 7 (విజయక్రాంతి): మరిపెడ మున్సిపల్ ఎన్ని కల్లో బీఆర్‌ఎస్ గెలుపు తధ్యమని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. మరిపెడ మండల కేంద్రంలో నిర్వహించిన మున్సిపల్ పరిధి కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి డిఎస్ రెడ్యా నాయక్ మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మరిపెడ పురపాలికలోని 15 వార్డులతోపాటు చైర్మన్ స్థానం బీఆర్‌ఎస్ సునా యాసంగా గెలుచుకోనుందన్నారు.
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు సునాయాసంగా గెలిచారని స్పష్టం చేశారు. అదే స్పూర్తితో పురపాలక ఎన్నికల్లోనూ పార్టీ శ్రేణులు సమన్వయంతో పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, పట్టణ అధ్యక్షుడు ఉప్పల నాగేశ్వరరావు, డీ ఎస్ రవి చంద్ర, ఆయుబ్ పాషా, గంట్ల మహిపాల్ రెడ్డి, గంట్ల శ్రీనివాస్ రెడ్డి, గంట్ల శ్రీనివాస్ రెడ్డి, పానుగోతు వెంకన్న, సయ్యద్ లతీఫ్, మక్సుద్ద్, దిగజర్ల శ్రీనివాస్, గోల్కొండ వెంకన్న పాల్గొన్నారు.