calender_icon.png 10 January, 2026 | 4:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవో నంబర్ 121ను రద్దు చేయాలి

08-01-2026 12:00:00 AM

తెలంగాణ అర్చక సమాఖ్య డిమాండ్

మేడిపల్లి, జనవరి 7 (విజయక్రాంతి): తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టంలో సవరణలు చేసి అర్చకుల పాలిట శాపంగా మారిన జీవో నెంబర్ 121రద్దు చేయాలని తెలంగాణ అర్చక సమైక్య నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం జిహెచ్‌ఎంసి పరిధి మేడిపల్లిలో తెలంగాణ అర్చక సమైక్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ అర్చక సమైక్య, తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ ఉపేందర్ శర్మ మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దేవాదాయ శాఖ చట్టాన్ని సవరించి సమాన వేతన పద్ధతిని అమలు చేయాలని, అర్చకులకు ఉద్యోగ భద్రత, ఆరోగ్య భీమా, సదుపాయం కల్పించాలని, పదవి విరమణ పొందిన అర్చకుల కు పెన్షన్ ఇవ్వాలని, గ్రాడ్యుటీ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ మంత్రి కుండా సురేఖను పలుమార్లు కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందించామని వారు చొరవ తీసుకొని ముఖ్య మంత్రితో చర్చించి తమకు న్యాయం చేయాలని అర్చకులు కోరారు.