calender_icon.png 10 January, 2026 | 6:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుట్టల మల్లన్న జాతరకు ఆహ్వానం

08-01-2026 12:00:00 AM

మేడ్చల్ అర్బన్ జనవరి 7 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ సర్కిల్ ప్రాంతంలో గల గిర్మాపూర్ మున్సిపల్ పరిధిలోని గుట్టల మల్లన్న జాతర ఉత్సవాలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామన్నగారి రాఘవేందర్ గౌడ్ కు ఆలయ కమిటీ అధ్యక్షులు వంగేటి పద్మా రెడ్డి ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రం అందజేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా పద్మా రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహించే గుట్టల మల్లన్న జాతర గుడికి 20 నుండి 30 వేల రూపాయల వరకు విరాళం అందిస్తున్న ఆర్ రాఘవేందర్ గౌడ్ కు ప్రత్యేకంగా ఆహ్వాన పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో ఈసారి నిర్వహిస్తున్న గిర్మాపూర్ గుట్టల మల్లన్న జాతరకు 21 వేల రూపాయల విరాలని నగదుగాb ఆర్ రాఘవేందర్ గౌడ్ అందించడం జరిగిందని పద్మా రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామన్నగారి రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ గిర్మాపూర్ గుట్టల మల్లన్న జాతర నిర్వహణలో పాల్పంచుకుంటున్న ఆలయ కమిటీ సభ్యులకు మల్లికార్జున స్వామి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో గు మల్లన్న స్వామి ఆలయ కమిటీ సభ్యులు ముక్కెర ఆనంద్.కృష్ణ. సత్యం పాల్గొన్నారు.