17-09-2025 06:07:24 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలోని మారుమూలకు ప్రాంతాలలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించిన జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో జిల్లాలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలలో ఒప్పంద ప్రాతిపదికన ఇటీవల నియమించబడిన 13 మంది వైద్యులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకు జిల్లాలో 13 మంది వైద్యులను నియమించడం జరిగిందని తెలిపారు.
జిల్లాలోని మారుమూల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వైద్యులు విధులలో సమయపాలన పాటిస్తూ నిబద్ధతతో పనిచేయాలని, చికిత్స కొరకు వచ్చే ప్రజల పట్ల సహనంతో వ్యవహరించాలని తెలిపారు. సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మారుమూల గ్రామాలలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, రోజులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేయాలని తెలిపారు.