calender_icon.png 7 October, 2025 | 5:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల పాఠశాలలో విద్యార్థి అనుమానాస్పద మృతి

07-10-2025 03:20:53 PM

హైదరాబాద్: ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెదని ఘటన సిద్దిపేట జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో వివేక్ విద్యార్థి ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. దసరా పండుగ సెలవులు ముగియడంతో తండ్రి ఇవాళ ఉదయం 9 గంటలకు వివేక్ ను స్వగ్రామమైన నాగునూరు నుంచి తీసుకోచ్చి పాఠశాలలో వదిలేసి వెళ్లాడు. ఇంతలోనే తన కుమారుడు చనిపోయాడని తండ్రికి ఫోన్ వెళ్లింది.

వివేక్ కు ఏం జరిగిందని ఉపాధ్యాయులను అడిగితే విద్యార్థి పాఠశాలలోని కారిడార్‌లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మెడకు తాడు చుట్టుకుని చనిపోయాడని ఉపాధ్యాయులు చెప్తున్నారని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించి, శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పాఠశాలకు చేరుకుని దర్యాప్తు  పోలీసులు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.