16-07-2025 10:55:44 AM
కామారెడ్డి, (విజయక్రాంతి):, అక్రమ సంబంధం కామారెడ్డి జిల్లా(Kamareddy District) బిచ్కుందలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే నేపంతో ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన ఇది. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన అడికే రమేష్ (36) సంవత్సరాలు తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అనే నేపథంతో బుధవారం ఉదయం రమేష్ ఇంటికి వెళ్లి ఉండే వార్ కాశీనాథ్ అనే వ్యక్తి హత్యకు పాల్పడ్డాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు బిచ్కుంద పోలీసులు(Bichkunda Police) సంఘటన స్థలానికి చేరుకొని కారణాలను వెతుకుతున్నారు. హత్యకు కారణం అక్రమ సంబంధ మనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. బీచ్కుంద పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.