16-07-2025 07:17:57 PM
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు విడుదల చేయాలి
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టిఎల్ రవి
వెంకటాపురం నూగూరు,(విజయక్రాంతి): వెంకటాపురం మండల కేంద్రంలో కళాశాల విద్యార్థులకు నూతన బిల్డింగ్ మంజూరు చేయాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు విడుదల చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి ఎల్ రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు వెంకటాపురం మండల కమిటీ ఆధ్వర్యంలో కళాశాల నుంచి తాసిల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయంలో ధర్నా అనంతరం తహశీల్దార్ కి వినతి పత్రం అందచేశారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టిఎల్ రవి మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు దాదాపు నెల రోజులు గడిచినా విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా గత 5,6 సంవత్సరాల నుంచి పెండింగులో ఉన్న స్కాలర్షిప్ ఫీజు బకాయిలు రూ. 8500 కోట్ల దాకా ఉన్నాయన్నారు. దీని కారణంగా పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువులు మధ్యలో ఆగిపోతున్నాయని అన్నారు. అదేవిధంగా ప్రైవేట్ కళాశాలలో ఫీజు కడితే సర్టిఫికెట్లు ఇస్తానని విద్యార్థులు భయాందోళన గురిచేస్తున్నారని, దాంతోపాటు వెంకటాపురం మండల కేంద్రంలో సుమారుగా కళాశాలలో 250 మంది విద్యార్థులు దాకా విద్యను అభ్యసిస్తున్నారు.
కానీ బిల్డింగ్స్ సౌకర్యం లేక విద్యార్థులు చదువులు మార్గమధ్యలోనే ఆగిపోయే పరిస్థితి నెలకొన్నదని అన్నారు. అధికారులు నూతన బిల్లింగ్ లను గురించి స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా మండల వ్యాప్తంగా విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు, బాత్రూంలు, ఫర్నిచర్, ఫ్యాన్లు లేక విద్యార్థులు అనేకమైన ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందని ఉన్నారు. విద్యార్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన దిగుతారని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సోడి అశోక్, జిల్లా కమిటీ సభ్యులు కొరుస వంశీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.