calender_icon.png 16 July, 2025 | 7:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కాలర్షిప్ లను విడుదల చేయాలి

16-07-2025 11:13:29 AM

పిడి ఎస్ యు రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.పవన్ కుమార్ 

వనపర్తిటౌన్: పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కాలర్షిప్(Fee Reimbursement Scholarship)లను విడుదల చేయాలని పిడిఎస్ యు రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.పవన్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రం లోని పిడిఎస్ యుఆధ్వర్యంలో ఈ పోస్ట్ కార్డ్ లేఖ ద్వారా రాష్ట్రంలోని విద్యా శాఖ లో రూ.7,000 కోట్ల పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని రాష్ట్రంలోని వేలాది మంది విద్యార్థుల తరఫున ఈ పోస్ట్ కార్డు లేఖ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి  తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలోని ఫీజు రీయింబర్స్‌మెంట్  పెండింగ్ బకాయిల కారణంగా అనేక మంది విద్యార్థులు వారి విద్యను కొనసాగించలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. కొందరు కాలేజీల్లో ప్రవేశాలు నిలిపివేయబడ్డాయన్నారు,పరీక్షలకు అనుమతి ఇవ్వడం లేదన్నారు.ఈ పెండింగ్ సమస్యతో విద్యార్థులపై మానసిక ఒత్తిడి అధిక మవుతోందని కుటుంబాలపై భారం పడుతుందని వారు వాపోయారు.తక్షణమే రాష్ట్రంలోని అన్ని విద్యాశాఖలలో పెండింగ్ ఉన్న రూ. 7,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని ఈ పోస్ట్ కార్డ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపామన్నారు.ఈ కార్యక్రమంలో పిడి ఎస్ యుజిల్లా కార్యదర్శి రాజు,అనిల్,కవిత,రాజేందర్,ప్రవీణ్ కల్పనా, తో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు