16-07-2025 10:21:29 AM
ఆదుకోవాలని రైతు ఎర్ర మల్లయ్య ఆవేదన
రాజాపూర్ : రాజాపూర్ మండల పరిధిలోని కుచర్కల్ గ్రామ శివారులో మంగళవారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన ఎర్ర మల్లయ్య కు చెందిన 15 గొర్రె పిల్లలు కుక్కల దాడిలో మృతి చెందినట్లు మల్లయ్య తెలిపారు. గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో గొర్రెలను మేపుతుండగా కుక్కలు దాడి చేసి 15 గొర్రె పిల్లలను మట్టు పెట్టాయని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని ఈ సందర్భంగా రైతు ఎర్ర మల్లయ్య వేడుకుంటున్నాడు.