16-07-2025 07:25:07 PM
డిస్టిక్ డిఎంటి కోఆర్డినేటర్ గుడిపూడి వెంకటేశ్వరరావు
తుంగతుర్తి,(విజయక్రాంతి): సమాజంలో పేద ప్రజలకు లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేని డిస్టిక్ డిఎంటి కోఆర్డినేటర్ గుడిపూడి వెంకటేశ్వరరావు అన్నారు బుధవారం మండల కేంద్రంలోని పద్మశాలి భవనంలో లైన్స్ క్లబ్ సూర్యాపేట వారి సౌజన్యంతో నూతనంగా తుంగతుర్తి ఇంటర్నేషనల్ లైన్స్ క్లబ్ ను ప్రారంభించి మాట్లాడారు. అనంతరం తుంగతుర్తి క్లబ్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు.
1917 సంవత్సరంలో లైన్స్ క్లబ్బులు ప్రారంభమై 200కు పైగా దేశాలలో సుమారు 14 లక్షల మంది సభ్యత్వం పొంది అనునిత్యం ఉచిత సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు బుధవారం నూతన క్లబ్ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమ నిర్వహించారు. క్లబ్ అధ్యక్షునిగా పోలవరపు సంతోష్ ప్రధాన కార్యదర్శిగా పులుసు వెంకన్న కోశాధికారిగా గుండ గాని రాములను ఉపాధ్యక్షులుగా తల్లాడ కేదారి ప్రోగ్రాం కోఆర్డినేటర్లుగా ఓరుగంటి శ్రీనివాస్ ఎలగందుల గిరి యాదగిరి గౌడ్ కేతిరెడ్డి రవీందర్ రెడ్డి ఎన్నుకున్నారు.