16-07-2025 07:03:01 PM
చండూరు,(విజయక్రాంతి): మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనయుడు కోమటిరెడ్డి సంకిర్త్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోరిమి ఓంకారం, చండూర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు అనంతచంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు చండూరులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కావలి ఆంజనేయులు, గంట సత్యం, దోటి వెంకన్న, వేణు తదితరులు పాల్గొన్నారు.