calender_icon.png 17 July, 2025 | 1:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మురుమూరు గ్రామ పంచాయతీలో ఇంటింటి ఫీవర్ సర్వే

16-07-2025 07:20:47 PM

వాజేడు,(విజయక్రాంతి): వాజేడు మండలంలోని మురుమూరు గ్రామపంచాయతీ పరిధిలో గల గణపురం, గణపురం కాలనీ, మోట్ల గూడెం గ్రామాలలో వాజేడు పిహెచ్ సీ వైద్య బృందం ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహించారు. వాజేడు వైద్యులు కొమరం మహేందర్ జ్వరంతో బాధపడుతున్న వారి ఇంటికి వెళ్లి స్వయంగా పరీక్షించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జ్వరం వచ్చినప్పుడు తీసుకోవలసిన చర్యల గురించి వివరించారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి పరిసరాలను పరిశీలిస్తూ,నిల్వ నీటిని పారబోసి, మురికి గుంటల్లో లార్వా నాశిని మందు పిచికారి చేశారు. జ్వరంతో బాధపడుతున్న వారికి రక్త పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య సమస్యలు ఏమైనా ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ కోటిరెడ్డి, సత్య నాగవేణి ఏఎన్ఎం, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.