calender_icon.png 18 July, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరం మొత్తం పరిశుభ్రంగా ఉండేలా చూడాలి: మున్సిపల్ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్

16-07-2025 07:30:09 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ కళాభారతిలో పారిశుధ్య విభాగం ఆద్వర్యంలో నమస్తే డే వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ పారిశుధ్య విభాగంకు చెందిన స్వచ్చ్ ఆటో, ట్రాక్టర్ కార్మీకులకు, డ్రైన్ క్లీనర్లకు, ఆఫ్రాన్స్, గంబూట్స్, గ్లౌజ్ లు, హెల్మెట్లు, మాస్కులతో కూడిన  రక్షణ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం పారిశుధ్య విభాగం సానిటేషన్ ఇన్ స్పెక్టర్లు, జవానులకు సలహాలు సూచనలు చేసి ఆదేశాలు జారీ చేశారు. ఈ సంధర్బంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ... నగర వ్యాప్తంగా పారిశుధ్య పనులను ఇంకా మెరుగు పరుచలని, రోడ్లు పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చెత్త కనబడకుండ పరిశుభ్రంగా ఉంచాలన్నారు.

రోడ్ల పై ఎక్కడ గార్బెజ్ కనబడిన ఎస్సై, జవానులే బాధ్యత వహించాలన్నారు. గార్బెజ్ పాయిట్లను కూడ పరిశుభ్రంగా ఉంచాలని ఎక్కడ చెత్త కనబడిన సంబంధిత జవాను, ఇన్ స్పెక్టర్లు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రతి స్వచ్చ్ ఆటో ఎవరి డివిజన్ లో వారు హౌజ్ టూ హౌజ్ తిరిగి డ్రై పేస్టు, వెట్ వేస్టు వేరు వేరుగా సేకరించాలన్నారు. సేకరించిన చెత్తను తప్పకుండ డీఆర్ సీసీ సెంటర్లకు తరలించాలన్నారు.  నగరపాలక సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన డీఆర్ సీసీ లకు స్వచ్చ్ ఆటోలు తప్పక వెళ్లాలని అన్నారు. డీఆర్ సీసీ కి వెల్లిన తర్వాతే మిగిలిన చెత్తను డంపు యార్డుకు తరలించాలన్నారు.  ప్రతి ఇంటికి స్వచ్చ్ ఆటో వెల్లేలా జవానులు మానిటరింగ్ చేయాలన్నారు.

రోడ్లు, పరిసరాల్లో ఎవరు చెత్త వేసిన జరిమానాలు వేయాలని అన్నారు. హౌజ్ నెంబర్ ప్రకారం ఇచ్చిన పెండింగ్ ట్రేడ్ లైసెన్స్ ను త్వరగా పూర్తి చేయాలన్నారు. వేగవంతం గా తొమ్మిది వేల ట్రేడ్ లైసెన్స్ కట్టించేలా సానిటేషన్ ఇన్ స్పెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. నగరంలో ఎక్కడ చాంబర్లు ఉన్న క్లీనింగ్ చేయాలన్నారు. చాంబర్లలో ప్లాస్టిక్ కవర్లు చెత్త ఇరుకున్న దాన్ని తొలగించేలా చూడాలని అన్నారు. వర్షకాలం కాబట్టి మీ ప్రాంతాల్లో ఎక్కడైన నీరు నిలిచే ప్రాంతాలు ఉంటే వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీజనల్ వ్యాదుల రాకుండ చేపట్టాల్సిన చర్యలు చేపట్టాలని కోరారు.

నీటి గుంటలను తొలగించడం తోపాటు ఓపెన్ ఖాళీ స్థలాల్లో చెత్తను శుభ్రపరచాలని అన్నారు. నీటి గుంటల్లో స్ప్రే, ఆయిల్ బాల్స్ వేసి... ఫాగింగ్ చేపట్టాలని కోరారు. డివిజన్ లలో ఓపెన్ ఖాళీ స్థలాలను గుర్తించి వాటి యజమానులకు నోటీసులు జారీ చేయాలన్నారు. నోటీసులు జారీ చేసి ఖాళీ స్థలాలను పరిశుభ్రపరిచేలా ఎస్సైలు, జవానులు చూడాలని ఆదేశించారు. డ్రై వేస్టు, వెట్ వేస్టు వేరు చేసిన తర్వతే డంపుయార్డుకు మిగిలిన చెత్త వెల్లాలని అన్నారు. సానిటేషన్ లో ఎక్కడ గ్యాబ్స్ వచ్చిన జవానులు, ఇన్ స్పెక్టర్ల పై చర్యలు తీస్కుంటామని హెచ్చరించారు. కరీంనగర్ నగరం మొత్తం నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూడటమే పారిశుధ్య విభాగం అధికారులు, సిబ్బంది భాధ్యత అన్నారు.