calender_icon.png 25 July, 2025 | 8:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.8.42 కోటత్లో బీటీ రోడ్లు ప్రారంభం

23-07-2025 12:00:00 AM

నియోజక అభివృద్దే ఎమ్మెల్యే జారే ధ్యేయం

అశ్వారావుపేట,జూలై 22,(విజయ క్రాంతి) :అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా తన అడుగులు వేయటం జరుగుతుందని అశ్వారావుపేట శాసనసభ్యు లు జారె ఆదినారాయణ అన్నారు. మంగళవారం దమ్మపేట మండలంలో రూ. 8.42 కోట్ల విలువైన బీటీ రోడ్లు ప్రారంబించారు. గిరిజన గ్రామాల మధ్య కనెక్టివిటీ మెరుగుపరిచే ఈ రోడ్లు ప్రజల రాకపోకలకు చాలా ఉపయోగకరంగా మారనున్నాయి అన్నారు.

ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సౌకర్యం కోసం వారి అవసరాలను తీర్చడానికి మా ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తూ నియోజకవర్గంలో బీటీ రోడ్లు సీసీ రోడ్ల నిర్మాణం వేగంగా చేపట్టి పల్లె ప్రజలకు ప్రయాణాలను మెరుగు పరుస్తుందన్నారు . అంతేకాకుండా వ్యవసాయ రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ద తీసుకోని నియోజకవర్గ వ్యాప్తంగా రైతులకు ఉపయోగపడే వి ధంగా గ్రావెల్ రోడ్లును అభివృద్ధి చేస్తున్నట్టు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో భగవాన్ రెడ్డి, ఎంపీడీవో రవీంద్రరెడ్డి , ఎంపీఓ రామారావు ,ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కృష్ణ సాగర్ , కాం గ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.