25-07-2025 01:35:27 AM
హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): హైకోర్టు విధించిన గడువు ముగుస్తుండటం తో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లపై ఆసక్తి నెలకొంది. తెలంగాణ క్యాబినెట్ చేసిన ఆర్డినెన్స్‌పై గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ న్యాయ సలహా తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆయన న్యాయనిపుణులతో చర్చించారు. వీరితోపాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, అడ్వొకేట్ జనరల్‌తోనూ చర్చలు జరిపారు.
అనంతరం న్యా య సలహా కోసం కేంద్ర హోం శాఖకు ఆర్డినెన్స్‌ను పంపించారు. రెండు వారాల్లో ఆర్డినెన్స్‌పై గవర్నర్ ప్రభుత్వానికి వివరణ ఇవ్వా లని నిబంధన ఉన్న నేపథ్యంలో సర్వత్రా ఉ త్కంఠ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం జులై 15వ తేదీన రాజ్‌భవన్‌కు పంచాయతీ ఎన్నికల ఆ ర్డినెన్స్ ఫైల్ పంపింది. దీంతో ఈ నెల 29వ తేదీలోపు ఆర్డినెన్స్‌పై ప్రభుత్వానికి గవర్నర్ వివరణ ఇవ్వాల్సి ఉంది.
మరోవైపు హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలో స్థానిక ఎన్నికలు సెప్టెంబర్ 30లోగా పూర్తిచేయాల్సి ఉం ది. కాగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అం శం కొలిక్కి వచ్చాకే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ క్రమంలో బీసీలంతా స్థానిక ఎన్నికల్లో ఖరారు అయ్యే రిజర్వేషన్లపై ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.