calender_icon.png 26 July, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమ్మక్క-సారక్క జాతరకు రైల్వే సదుపాయం కల్పించాలి

25-07-2025 01:26:25 AM

  1. కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఎంపీ ఈటల విజ్ఞప్తి

హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీల పండుగైన మేడారం సమ్మక్క-సారక్క జాతరకు రవాణా సదుపాయాలు కల్పించడంలో భాగంలో రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కోరారు. గురువారం ఆయన ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు.

మేడారం సమ్మక్క జాతరకు వచ్చే భక్తులు రవాణా పరంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. రైలుమార్గం ఏర్పాటు చేస్తే సమస్యలన్నీ పరిష్కారమవుతాయన్నారు. అలాగే వెనకబడిన ఈ ప్రాంతానికి రైల్వే నెట్‌వర్క్ ఏర్పాటుతో రవాణా సదుపా యం అందుబాటులోకి వచ్చి ఆర్థికంగా, సా మాజికంగా అభివృద్ధి చెందే అవకాశం లభిసుందన్నారు.

అందుకే ఇక్కడ రైల్వే మార్గం ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కోరారు. హైదరాబాద్‌లో పలు చోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలన్నారు. అయోధ్య ఎక్స్ రోడ్డు వద్ద ఆర్‌వోబీ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. వైద్యపరంగా, ఇతర కారణాలతో మరణించిన రైల్వే ఉద్యోగులు, కార్మికుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు.