25-07-2025 02:34:59 AM
డీజీపీకి ఓయూ జేఏసీ వినతి
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 24 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో కొ లివింగ్ హాస్టల్స్ (యువతి, యువకులు కలిసి ఉండే హాస్టల్స్) సంస్కృతిని రద్దు చేయాలని కోరుతూ మలిదశ తెలంగాణ ఉద్యమకారుల ఓయూ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో డీజీపీ జితేందర్‌ను గురువారం కలిసి విన్నవించారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న గన్ కల్చర్‌ను నిర్మూలించాలని వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఓయూ జేఏసీ చైర్మన్, బీజేపీ రాష్ట్ర నాయకులు రాజు నేత మాట్లాడుతూ.. హైదరాబా దులో ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు, ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని కో- లివింగ్ హాస్టల్స్ పేరిట విద్యార్థి, యువత జీవితాలు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. కో లివింగ్ హాస్టల్స్ సంస్కృతి ద్వారా యువతి, యువకులను ఆఫర్ల పేరిట ఆకర్షించి మోసాలు చేస్తున్నారని అన్నారు.
కో- లివింగ్ హాస్టల్స్‌లో మాదకద్రవ్యాలు వాడ కం పెరిగిపోతుందని ఆరోపించారు. నగర శివారులో ఎటువంటి పరిమిషన్స్ లేకుండా కో లివింగ్ హాస్టల్స్ నడుపుతున్నారని ఆరోపించారు. వాటి మీద ప్రత్యేక బృందాల చేత తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది వ్యాపారస్తులు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులతో కుమ్మక్కై, అక్రమ గన్ కల్చర్‌తో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని తెలిపారు.
అక్రమ మారణాయుధాల రవాణా మీద దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ మలిదశ తెలంగాణ ఉద్యమకారులు ఎనుగంటి రాజు నేత, చెరుకు మణికంఠ, ఏకుల జగన్, ఇమ్మడి మహేష్, గద్దె మహేష్, సత్తూరి శ్రీశైలం, గోవింద్ సురేష్ ఉన్నారు.