calender_icon.png 27 July, 2025 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తర్వాతి షెడ్యూల్ ఎప్పుడో?

25-07-2025 01:57:01 AM

‘ఎస్‌ఎస్‌ఎంబీ29’.. వరల్డ్ టాప్ క్లాస్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి దర్శక సారథ్యంలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కాంబోలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. ఇందులో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినా ఈ ప్రాజెక్టు ఆరంభం నుంచీ అంచనాలు భారీగా నెలకొన్నాయి. మహేశ్ బాబు కాంబో సినిమా అన్న ప్రకటన వెలువడిన క్షణం సూపర్ స్టార్ అభిమానులంతా ఫుల్ ఖుషీ అయ్యారు.

దర్శకధీరుడు, అద్భుతాలు సృష్టించే జక్కన్నతో తమ అభిమాన హీరో మహేశ్ సినిమా చేస్తున్నాడని ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే రాజమౌళితో సినిమా అంటే మూడు, నాలుగేళ్లు పడుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. జక్కన్న ప్రాజెక్టులు ఆలస్యానికి కొన్ని వ్యక్తిగత కారణాలే ఉంటాయి. ప్రస్తుతం ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ ప్రాజెక్టుదీ అదే దారి అని తెలుస్తోంది.

ఈ ప్రాజెక్టు షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైన సంగతి విదితమే ఒడిశాలో కొరాపుట్ జిల్లా సిమిలిగూడ సమీపంలోని మాలి, పుట్‌సీల్, బాల్డా ప్రాంతాల్లో షూటింగ్ జరిపారు. ఈ షెడ్యూల్‌లో పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ తర్వాత షెడ్యూల్ కెన్యాకు మారాల్సి ఉంది. అది ఈ జూలై నెలలోనే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, అక్కడ అనుకూల పరిస్థితులు లేకపోవడం వల్ల ఈ షెడ్యూల్‌ను రద్దు చేసిందట టీమ్.

అలా బ్రేక్ పడిన ఈ షెడ్యూల్ చిత్రీకరణను.. కెన్యాకు ప్రత్యామ్నాయంగా దక్షిణాఫ్రికాకు మార్చినట్టు సమాచారం. అయితే, షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు.  మరోవైపు షూటింగ్‌లో చోటుచేసుకుంటున్న ఈ జాప్యం వెనుక ఉన్న కారణాలేంటో తెలుసుకునే పనిలో పడ్డారంతా! ఇదిలా ఉండగా, ఈ గ్యాప్‌లో జక్కన్న సినిమా కథను మరింత మెరుగ్గా చెక్కే పనిలో నిమగ్నమై ఉన్నారనే టాక్ వినవస్తోంది.