25-07-2025 01:10:39 AM
హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి) : గత దశాబ్ద కాలానికి పైగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ద్వయం ఆధ్వర్యంలోని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) భారతదేశంపై ప్రదర్శిస్తున్న రాజకీయ, పరిపాలన ఆధిపత్యం అందిరికీ స్పష్టంగా కనిపిస్తున్నది. వందేళ్లకు మించి ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని గత పదేళ్లుగా కోలుకోనివ్వడం లేదు. అన్ని వైపుల నుంచి దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ను కట్టడి చేస్తూ వస్తున్నారు.
ప్రత్యక్షంగా, పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి కళ్లెంవేస్తూ ఇప్పటికే మూడు పర్యాయా లు కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా అటూ కేంద్రంలోనూ ఇటు రాష్ట్రాల్లోనూ అధికారం చేజిక్కించుకోవాలని సరైన అవకాశం కోసం కాంగ్రెస్ పార్టీ ఎదురుచూస్తోంది. గత వైభవాన్ని అందిపుచ్చుకోవాలని వేచిచూస్తున్న కాంగ్రెస్‌కు తెలంగాణ రాష్ట్రం చుక్కానిలా మారింది.
జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొని, దేశవ్యాప్తంగా మళ్లీ పుంజుకునేందుకు ఏడాదిన్నరగా తెలంగాణ రాష్ట్రంలో అవలంబించిన సంస్కర ణలే కీలకం కానున్నాయి. కులగణన, బీసీ రిజర్వేషన్ బిల్లు ద్వారా రాబోయే అన్ని ఎన్నికల్లో బీజేపీ దూకుడును కట్టడి చేసే అస్త్రాన్ని జాతీయ కాంగ్రెస్ ‘చేతి’కి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించింది.
ఈ అవకాశాన్ని రాష్ట్ర నాయకుల సహకారం, సరైన సమన్వయంతో సద్వినియోగం చేసుకోవాలని రాహుల్ గాంధీ వ్యూహం రచిస్తున్నా రు. అందులో భాగంగానే తెలంగాణలో విజయవంతంగా నిర్వహించిన కులగణన సర్వే, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ బి ల్లుకు సంబంధించిన విషయాలను దేశవ్యాప్తం చేసేందుకే ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీంతో అటు బీజేపీకి, ఇటు అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన సంకేతాన్నీ పంపించారు.
దేశానికి దిక్సూచిగా తెలంగాణ..
ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న స మస్యకు తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్ర భుత్వం పరిష్కారం చూపించింది. స్వాతం త్య్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలోనే సాధ్యం కానీ కులగణన సర్వేను విజయవంతంగా పూర్తిచేసింది. దీనికి సంబంధించి అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదంకోసం రాష్ట్రపతికి కూడా పంపించింది. కేం ద్రం బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం లో జాప్యం చేస్తున్న తరుణంలో ఆర్గినెన్స్ రూపంలో మరో పరిష్కార మార్గాన్ని ఎంచుకుంది.
ఆ దిశగా అడుగు వేయడంలో భాగం గా ఆర్డినెన్స్‌ను ఇప్పటికే గవర్నర్‌కు కూడా పంపించింది. అన్నివర్గాల సహకారంతో బీసీ రిజర్వేషన్ సాధన కోసం జాతీయ స్థా యిలో పోరాటం చేస్తున్నది. పరిష్కారమే లక్ష్యంగా బీసీ అంశాన్ని గల్లీ నుంచి ఢిల్లీకి చేర్చింది. బీసీలకు అండగా నిలుస్తూ దేశాని కి దిక్సూచిగా నిలుస్తున్నది. బీసీల పట్ల బీజే పీ ప్రభుత్వం వివక్ష పూరితమైన ధోరణి చూపుతున్నదని ఎండ గడుతున్నది.
బీజేపీ వ్యూహానికి కట్టడి..
కులగణన, బీసీ రిజర్వేషన్ అంశాలతో బీసీ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ దగ్గరైంది. దశాబ్దాల సమస్యకు పరిష్కారం చూ పించడంతో కాంగ్రెస్ పట్ల సానుకూల దృక్ప థం ఏర్పడింది. ఈ క్రమంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి దేశవ్యాప్తంగా జనగ ణన చేస్తామని, అందులో కులగణన కూడా చేర్చుతున్నట్టు ప్రకటించింది. ఆలస్యం చేయకుండా ఆ ప్రక్రియను కూడా ప్రారంభించిం ది.
కులగణనతో కాంగ్రెస్‌కు వచ్చిన మైలేజ్‌ను జనగణనతో దూరం చేయాలనే స్పష్ట మైన వ్యూహాన్ని అమలు చేసింది. తద్వారా తాము మైలేజ్ పొందాలను యోచించింది. దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే దిశగా జాతీయ కాంగ్రెస్ పావులు కదుపుతున్నది. అందులో భాగంగా బీసీల రిజర్వేషన్ సమస్యను రాష్ట్రానికే పరిమితం చేయకుండా జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. దీనిని దేశవ్యాప్త సమస్యగా చూపించే ప్రయత్నం చేస్తుంది.
అయితే తెలంగాణకు సంబంధించిన బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రంలోని బీ జేపీ ఆమోదం తెలపని పక్షంలో ఈ అంశా న్ని వాడుకుని బీజేపీ దేశవ్యాప్తంగా బీసీల వ్యతిరేకిగా, ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని వ్యూహ రచన చేస్తుంది. రాబోయే అన్ని ఎన్నికల్లోనూ బీసీ రిజర్వేషన్ అంశాన్ని ప్రధాన అస్త్రంగా వాడుకోనున్నది. తద్వారా సానుకూల ఫలితాలను పొందాలని యోచిస్తున్నది.
బీజేపీ వ్యూహమే వేరు..
కులగణనతో కాంగ్రెస్ పార్టీ సంపాదించుకున్న మైలేజ్‌ను జన గణనతో తుడిచిపె ట్టే యాలని బీజేపీ వ్యూహం రచించింది. అయి తే అది ఫలించే లోపే కాంగ్రెస్ మరో ఎత్తుగడతో బీజేపీని ఇరుకున పెట్టేందుకు పూను కున్నది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ను జాతీయ స్థాయిలో కట్టడి చేసేందుకు బీజేపీ కార్యాచరణ రూపొందిస్తుంది. జనగణనతో మైలేజ్ రాని పక్షంలో వారికి అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకోవాలని యోచిస్తున్నది.
ఇందులో భాగంగా హిందూత్వం, డీ లిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అమలు చేయడం, అవినీతి లేని అభివృద్ధి వంటి అం శాలను ప్రధానంగా వాడుకోనున్నది. రాబో యే ఎన్నికల్లో కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ అం శాన్ని అస్త్రంగా వాడుకుంటే బీజేపీ మాత్రం డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్‌లతో కాం గ్రెస్‌ను ధీటుగా ఎదుర్కోనున్నది.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఎన్ని రకాలుగా వ్యూహాలు రచించినా ఎప్పటిలాగే బీజేపీ వద్ద దర్యాప్తు సంస్థలు, కేసుల వంటి అస్త్రాలు రెడీగా ఉన్నా యి. వాటిని బీజేపీ ఎంత సమర్థవంతంగా వాడుకోగలదో కూడా స్పష్టంగా తెలిసిన విషయం. అన్నింటికీ మించి చేయిదాటిపోయినా మళ్లీ పుంజుకోవడానికి వ్యూహాలు రచించేందుకు నరేంద్రమోడీ, అమిత్‌షా ఉ న్నారు. గత మూడు ఎన్నికల్లో బీజేపీ సాధించిన విషయమే దీనికి నిదర్శనం.
రేవంత్‌రెడ్డిని మెచ్చిన రాహుల్ గాంధీ..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత సీఎం కావడానికి రేవంత్‌రెడ్డికి రా హుల్ గాంధీ పూర్తిస్థాయిలో సహకరించారు. అయితే ఆ తర్వాత కొద్ది కాలంలోనే రాహుల్ గాంధీకి సీఎం రేవంత్‌రెడ్డికి చెడిందని, వారి మధ్య గ్యాప్ వచ్చిందని ఊహాగా నాలు చక్కర్లు కొట్టాయి. ఈ కారణంగానే రేవంత్‌రెడ్డి పదుల సంఖ్యలో ఢిల్లీకి వెళ్లినా రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని చర్చ జరిగింది.
రేవంత్‌రెడ్డిని రాహుల్ గాంధీ పట్టించుకోవడం లేదనే వాదనలు కూడా వినిపించాయి. అయితే బీసీ రిజర్వేషన్ అంశంతో రేవంత్‌రెడ్డి, రా హుల్ గాంధీల మధ్య వ్యవహారంలో ఒక స్పష్టత వచ్చింది. రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డిల మధ్య ఎలాంటి దూరం లేదని తేలింది. జాతీయ కాంగ్రెస్ పార్టీకి కావాల్సిన ఊతం, బీజేపీ ఎదుర్కొనే ప్రధాన అస్త్రాన్ని రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వ డంతో రాహుల్ గాంధీ కూడా రేవంత్‌రెడ్డిని బహిరంగంగానే మెచ్చుకున్నారు.
రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో అద్భుతమైన పాలన కొనసాగుతుందని కొనియాడారు. దీంతో వారిద్దరి మధ్య దూరం ఉందని అంటున్న ప్రతిప క్ష పార్టీల నోళ్లు మూతపడుతున్నాయి. జాతీ య కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ తీసుకొచ్చిన సీఎంగా రాహుల్ గాంధీ దృష్టిలో రేవంత్‌రెడ్డి మంచి పేరు తెచ్చుకున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కావాల్సిన వ్యూ హాన్ని రేవంత్‌రెడ్డి అందించారు. ఈ క్రమం లో రేవంత్‌రెడ్డి, రాహుల్ గాంధీల మధ్య దూరం ఉందనే వార్తలకు తెరపడింది.