calender_icon.png 24 July, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈటలా.. నీకు రాజకీయభిక్ష పెట్టింది కేసీఆర్ కాదా?

23-07-2025 12:00:00 AM

  1. ఈటలది బీసీలపై కపట ప్రేమ
  2. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు పోరాటం చేస్తా
  3. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి

హుజురాబాద్,జులై22: (విజయక్రాంతి): ఈటెల నీకు రాజకీయ బిక్ష పెట్టింది కేసీఆర్ కాదా అని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏ ర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ ని కెసిఆర్ ఎమ్మెల్యేగా గెలిపించి ఫ్లోర్ లీడర్ చేసి, రెండుసార్లు మంత్రివర్గంలో చోటు కల్పించిన ఘనత కెసిఆర్ దేనని, ఆయన చాటున పెరిగిన నీవు కేసీఆర్ విమర్శించే స్థా యికి ఎదిగినావా రాజేంద్ర అని ప్రశ్నించారు.

కొడుకు బిడ్డ పేర్లు పక్కన రెడ్డి అని పెట్టుకున్న నీవు బీసీ ఎలా అయితావని ప్రశ్నించారు. కమలాపూర్ లో ఉన్న ఈటెల బంధువులను ఏ నాడైనా హైదరాబాద్కు తీసుకువెళ్లి కనీసం అన్నం పెట్టావా ఈటెల అని అన్నారు. ఈటల రాజేందర్ బిసి ముసుగులో ఉ న్న దొర అని, గుడ్లు అమ్ముకునే స్థాయి నుంచి బంగారు గుడ్లు అమ్ముకునే వరకు ఎలా ఎదిగావని ఆయన అన్నారు.

ఈటలను నమ్ముకొని మోసపోయిన వారంతా తిరిగివస్తే వారికి ఎ ప్పుడు ఆహ్వానం పలికేందుకు హుజురాబాద్ నియోజకవర్గం లో నేను సిద్ధంగా ఉంటానని అన్నారు.ఈటల రాజేందర్ బిఆర్‌ఎస్ కార్యకర్తల జోలికి వచ్చి ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. రానున్న గ్రామపంచాయతీ ము న్సిపల్ అన్ని ఎన్నికలలో హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రతి పోటీలో బిఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించి తీరుతానని అన్నా రు. 

హుజురాబాద్ నియోజకవర్గం ఈటెల రాజేందర్ ను ఎప్పుడో మర్చిపోయిందని, ఇక హుజురాబాద్ లో ఈటెల రా జేందర్ కి ఎలాంటి మద్దతు దొరకదని విషయాన్ని మర్చిపోకూడదన్నారు. సమావేశంలో బి ఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బం డ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, మాజీమార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ రావు, ఎంపీపీలు రాణి సురేందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కన్నురి సత్యనారాయణరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ గందే రాధిక శ్రీనివాస్, రాజేశ్వరరావు, సంగేమ్ ఐలయ్య, రంజిత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.